Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్ఫైనల్లో హుర్క్రాజ్ చేతిలో ఓటమి
ఫ్లోరిడా(అమెరికా): మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్, రష్యాకు చెందిన మెద్వెదెవ్ అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. గురువారం రాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో మెద్వెదెవ్ 6-7(7-9), 3-6తో 8వ సీడ్ హుర్క్రాజ్(పోలెండ్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌లో 2వ సీడ్ జర్మనీకి చెందిన ఆండీ జ్వెరెవ్(జర్మనీ) కూడా క్వార్టర్స్‌లో మూడుసెట్ల పోటీలో ఓడాడు. జ్వెరెవ్ 3-6, 6-1, 3-6తో 6వ సీడ్ రూఢ్(ఇంగ్లండ్) చేతిలో పరాజయాన్ని చవిచూసాడు. సెమీస్‌లో రూఢ్తో సెరుండెలో, హుర్క్రాజ్తో గర్ఫియా(స్పెయిన్) అమీతుమీ తేల్చుకోనున్నారు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాకా
ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లోకి అన్‌సీడెడ్, జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకా, ఇగా స్వైటెడ్ ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో 2వ సీడ్ స్వైటెక్(పోలెండ్) 6-2, 7-5తో 16వ సీడ్ పెగూలా(అమెరికా)ను వరుససెట్లలో ఓడించింది. రెండో సెమీస్‌లో ఒసాకా 4-6, 6-3, 6-4తో 22వ సీడ్ బెన్సిక్(స్విట్జర్లాండ్)పై పోరాడి గెలిచింది. ఫైనల్ శనివారం జరగనుంది.