Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్స్‌కు రైల్వేస్, హిమాచల్ జట్లు
- జాతీయ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్
హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య తెలంగాణ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో హిమాచల్‌ప్రదేశ్‌తో తలపడిన తెలంగాణ 9-16తో పరాజయం పాలైంది. హిమాచల్ దూకుడు ముందు తొలి అర్ధభాగంలో తేలిపోయిన తెలంగాణ 3-11తో వెనుకంజ వేసింది. ద్వితీయార్థంలో పుంజుకున్న ఆతిథ్య జట్టు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చింది. కానీ హిమాచల్ భారీ ఆధిక్యంలో ఉండటంతో పెద్దగా ఫలితం లేకపోయింది. తొలి సెమీఫైనల్లో రైల్వేస్ 24-22తో హరియాణాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. 12-12తో సమవుజ్జీగా నిలిచిన రైల్వేస్, హరియాణా మ్యాచ్ ద్వితీయార్థంలోనూ ఉత్కంఠగా సాగింది. సెమీస్ మ్యాచ్‌లకు ముఖ్య అతిథులుగా హాజరైన భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావు టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో సెమీస్ పోరులో బలమైన ఆదివారం ఉదయం రైల్వేస్, హిమాచల్‌ప్రదేశ్ ఫైనల్లో తలపడనున్నాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల హాజరుకానున్నారు.