Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్‌పై కన్నేసిన ఇంగ్లాండ్
- మహిళల వరల్డ్‌కప్ ఫైనల్ నేడు
క్రైస్ట్‌చర్చ్ : ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్ ఊహించినదే!. మహిళల క్రికెట్లో అగ్రజట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు వన్డే వరల్డ్‌కప్ టైటిల్ కోసం నేడు తాడోపేడో తేల్చుకోనున్నారు. 2017లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ నేడు డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలుపుకునేందుకు బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ ఎన్నడూ టైటిల్ నిలుపుకున్న చరిత్ర ఇంగ్లాండ్‌కు లేదు. టోర్నీలో అజేయ రికార్డుతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియా మరో ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు తహతహ లాడుతోంది. లీగ్ దశలో తొలి మూడు మ్యాచుల్లో ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం నుంచి పుంజుకున్న ఇంగ్లాండ్ నేడు అదే స్ఫూర్తితో బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో నేడు టైటిల్ పోరులో ఆస్ట్రేలియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తుండగా.. ఇంగ్లాండ్ బంతితో పటిష్టంగా ఉంది. రేచల్ హేన్స్, మెగ్ లానింగ్‌లు ఆస్ట్రేలియాకు.. నటాలీ సీవర్, టామీ బ్యూమోంట్లు ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ విభాగంలో కీలకం. జెస్ జొనాసెన్, అలానా కింగ్‌లు ఆసీస్‌కు...సోఫీ ఎకల్‌స్టోన్, చార్లీ డీన్లు ఇంగ్లాండ్‌కు బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే మ్యాచ్‌లో మంచు ప్రభావం సైతం ఉండనుంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ టైటిల్ పోరు నేడు ఉదయం 6.30 గంటలకు ఆరంభం.