Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో రైల్వేస్‌పై సాధికారిక విజయం
హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ 2022 టైటిల్ ను హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హిమాచల్ 20-10 తేడాతో రైల్వేస్ జట్టుపై ఘన విజయం సాధించింది. జాతీయ హ్యాండ్‌బాల్ టోర్నీలో విజేతలకు నిలిచిన జట్లకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ట్రోఫీలు బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 'తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగం అభివద్ధికి పెద్దపీట వేస్తోంది. త్వరలోనే శాట్స్, రాష్ట్ర ఒలింపిక్ సంఘం, జగన్ మోహన్ రావు సహకారంతో హైదరాబాద్ వేదికగా అతిపెద్ద క్రీడా ఫెస్టివల్‌ను నిర్వహిస్తాం. గత రెండేళ్లగా నగరంలో అంతర్జాతీయ స్థాయిలో హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్న జగన్ మోహన్ రావుకు ప్రత్యేక అభినందనలు' అని అన్నారు. బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ 'రాష్ట్రంలో క్రీడా రంగానికి పెరిగిన ఆదరణ చూస్తుంటే ముచ్చటగా ఉంది.హైదరాబాద్ హ్యాండ్‌బాల్‌కు హబ్‌గా మారుతుండడం సంతోషం. ప్రభుత్వం, క్రీడా సంఘాలు అందిస్తున్న ప్రోత్సాహన్ని సద్వినియోగం చేసుకొని యువ క్రీడాకారులు ఎదగాలని' పేర్కొన్నారు. 'పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, భారత ఒలింపిక్ సంఘానికి, సారుకి కతజ్ఞతలు. ప్రపంచస్థాయిలో భారత హ్యాండ్‌బాల్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటమే నా లక్ష్యం. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రంలో అతిపెద్ద క్రీడా సంబురం నిర్వహిస్తామని' జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్రావు వెల్లడించారు.