Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్
- రాణించిన బ్రావో, ప్రిటోరియస్
నవతెలంగాణ-ముంబయి
లియాం లివింగ్‌స్టోన్ (60, 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. సూపర్‌కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లివింగ్‌స్టోన్ సిక్సర్ల వర్షంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ముంచెత్తాడు. శిఖర్ ధావన్ (33, 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), జితేశ్ శర్మ (26, 17 బంతుల్లో 3 సిక్స్‌లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 180 పరుగులు చేసింది.
లివింగ్‌స్టోన్ దూకుడు : మంచు ప్రభావం చూపిస్తున్న ఐపీఎల్లో తొలిసారి టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ మరో ఆలోచన లేకుండా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్‌కు మెరుగైన ఆరంభం దక్కకపోయినా.. ఆరంభంలో ఆ జట్టు దండయాత్ర చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (4), భానుక రాజపక్సె (9) విఫలమయ్యారు. శిఖర్ ధావన్ (33), లియాం లివింగ్‌స్టోన్ (60) మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చిన్న బౌండరీల మైదానంలో లియాం లివింగ్‌స్టోన్ ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో కదం తొక్కాడు. ఈ ఇద్దరు జోరుతో పది ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 109 పరుగులు పిండుకుంది. చివరి పది ఓవర్లలోనూ అదే జోరు కొనసాగితే 200 పైచిలుకు స్కోరు సులువే అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో సూపర్‌కింగ్స్ బౌలర్లు పుంజుకున్నారు. ధావన్, లివింగ్‌స్టోన్ నిష్క్రమణ అనంతరం పంజాబ్ కింగ్స్‌లో ఎవరూ పెద్దగా చెలరేగలేదు. జితేశ్ శర్మ (26) ఒక్కడే మూడు సిక్సర్లతో మెరిశాడు. డ్వేన్ బ్రావో (1/32), డ్వేనె ప్రిటోరియస్ (1/30), క్రిస్ జోర్డాన్ (2/23)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖేశ్ చౌదరి (1/52) మరోసారి నిరాశపరిచాడు.