Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: ఐసిసి వన్డే ప్రపంచకప్ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో భారత మహిళా క్రికెటర్లలో ఒక్కరికీ చోటు దక్కలేదు. వన్డే ప్రపంచకప్ ఆదివారంతో ముగియడంతో ఐసిసి అత్యుత్తమ క్రీడాకారిణుల జాబితాను ప్రకటించింది. ఐసిసి ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్(దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసింది. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
ఐసీసీ అత్యుత్తమ జట్టు: అలిస్సా హీలీ(వికెట్ కీపర్-ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్(కెప్టెన్), రాచెల్ హేన్స్, బెత్ మూనీ(ఆస్ట్రేలియా), నాట్ స్కివర్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్(ఇంగ్లండ్), మారిజానే కాప్, షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా), హేలీ మాథ్యూస్(వెస్టిండీస్), సల్మా ఖాతున్(బంగ్లాదేశ్).