Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నో చేతిలో 12పరుగుల తేడాతో ఓటమి
- కెఎల్ రాహుల్, హుడా అర్ధసెంచరీలు
- ఆవేశ్‌కు 4,హోల్డర్‌కు 3వికెట్లు
ముంబయి: చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయగల్గింది.ఆవేశ్‌ఖాన్(4/24), హోల్డర్(3/ 34), కృనాల్ పాండ్యా(2/27) లక్నో గెలుపులో కీలకపాత్ర పోషించారు. టాస్ ఓడి బ్యాటింగ ్కు దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లో డికాక్(1), నాలుగో ఓవర్లో లెవీస్(1), ఐదో ఓవర్ మనీష్ పాండే(11) ఔటయ్యారు.దీంతో లక్నో జట్టు 27 పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కేఎల్ రాహుల్, హుడా కలిసి 87పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి లక్నో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నా రు. ఓ ఎండ్‌లో కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడినా.. మరోవైపు కెప్టెన్ అండగా దీపక్ హుడా చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లతో అర్ధ సెంచరీ(51) పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ కూడా బ్యాట్ ఝళిపించాడు. కేఎల్ రాహుల్ 50బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్ సాయంతో 68పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫామ్‌లో ఉన్న ఆయుష్ బడోని 12 బంతుల్లో మూడు ఫోర్లతో 19 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 6, జాసన్ హోల్డర్ 8 పరుగులు చేశారు. దీంతో లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగల్గింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సుందర్, నటరాజన్, షెఫర్డ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్ జట్టు 20ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి ఓటమి పాలైంది.