Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్
సంచియోన్ : భారత యువ బ్యాడ్మింటన్ స్టార్, ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ రన్నరప్ లక్ష్యసేన్ మరో టోర్నీలో టైటిల్ వేటను సానుకూలంగా ఆరంభించాడు. కొరియా ఓపెన్‌లో లక్ష్యసేన్ శుభారంభం గావించాడు. మహిళల విభాగంలో వర్థమాన తార మాళవిక బాన్సోద్ సైతం ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో లోకల్ హీరో చో జి హూన్‌పై 14-21, 21-16, 21-18తో మూడు గేముల మ్యాచ్‌లో లక్ష్యసేన్ గెలుపొందాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ తొలి గేమ్‌ను కోల్పోయాడు. చివరి రెండు గేముల్లో గొప్పగా పుంజుకున్న లక్ష్యసేన్ ఆధిపత్యం చెలాయించాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో మాళవిక బాన్సోద్ సైతం మూడు గేముల్లోనే గెలుపొందింది. 20-22, 22-20, 21-10తో వరల్డ్ నం.24 హన్ యు (చైనా)పై గెలుపొందింది.
నువ్వా నేనా అన్నట్టు సాగిన తొలి రౌండ్ పోరు నిర్ణయాత్మక మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన మాళవిక ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు 17-21, 7-21తో వరుస గేముల్లో మలేషియా ఆటగాడు జూన్ వీ చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్ విభాగంలో కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ జోడీ 14-21, 19-21తో.. నవనీత్, సుమీత్ రెడ్డి జంట 14-21, 12-21తో వరుస గేముల్లో ఓటమి చెందారు. కొరియా ఓపెన్ నుంచి నిష్క్రమించారు.