Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో స్వదేశానికి పయనం
ముంబయి : రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నైల్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గాయంతో రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచులకు దూరంగా ఉన్న పేస్ ఆల్‌రౌండర్.. స్వదేశానికి పయనం అయ్యాడు. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో గాయపడిన కౌల్టర్‌నైల్.. రిహాబిలిటేషన్ కోసం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు. నాథన్ కౌల్టర్‌నైల్‌ను రూ.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ వేలంలో తీసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టు సమతూకంలో అతడి పాత్ర కీలకం. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్‌లోనే గాయపడిన కౌల్టర్‌నైల్.. ఆ మ్యాచ్‌లో మళ్లీ బౌలింగ్ చేయలేదు. నాథన్కౌల్టర్ నైల్ స్థానంలో మరో ఆటగాడిని రాయల్స్ తీసుకోవాల్సి ఉంది.