Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంబ్లేపై మాజీ సీఓఏ వినోద్ రారు
న్యూఢిల్లీ : పాలకుల కమటీ (సీఓఏ) భారత క్రికెట్ వ్యవహారాలు పర్యవేక్షించిన సమయంలో ఎన్నో వివాదాలు చెలరేగాయి. అందులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే వివాదం క్రికెట్ వర్గాల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఏడాది పాటు భారత జట్టు చీఫ్ కోచ్గా విజయవంతమైన అనిల్ కుంబ్లే.. మరో ఏడాది కొనసాగింపు పొందలేదు 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ అనంతరం కుంబ్లే చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ ఎపిసోడ్లో అనిల్ కుంబ్లేను సమదృష్టితో, న్యాయంగా చూడలేదని జంబో భావిం చినట్టు పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రారు తను రాసిన పుస్తకంలో వెల్లడించాడు.
' సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) మరో ఏడాది పాటు అనిల్ కుంబ్లేకు పొడగింపు ఇచ్చింది. లండన్లో సమావేశమైన సీఏసీ కుంబ్లేకు ఎంపిక చేసింది. కానీ అనిల్ కుంబ్లే క్రమశిక్షణ శైలితో జట్టులోని యువ ఆటగాళ్లు ఏమాత్రం సంతోషంగా లేరని కెప్టెన్ విరాట్ కోహ్లి సీఓఏకు తెలిపాడు. జట్టును క్రమశిక్షణగా నడపటం, క్రికెటర్లకు ప్రొఫెషనలిజం తీసుకురావటం చీఫ్ కోచ్ బాధ్యత. ఈ విషయంలో సీఓఏ అనిల్ కుంబ్లే పక్షాన నిలువలేకపోయింది.
ఆ విషయంలో కుంబ్లే కాస్త బాధపడినట్టు తెలిసింది. ఆ వివాదంలో అటు కోహ్లి, ఇటు కుంబ్లే మీడియా ముందుకు రాలేదు. ఇద్దరూ పరిణతితో వ్యవహరించారు. లేదంటే పెద్ద దుమారమే రేగి ఉండేది' అని వినోద్ రారు రాసుకొచ్చాడు.