Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ఫుట్‌బాల్ ఆసియా చాంపియన్స్ లీగ్
హైదరాబాద్: ఒలింపిక్ క్రీడ అమెరికన్ ఫుట్‌బాల్ ఆసియా చాంపియన్స్ లీగ్‌లో భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కడప జిల్లాకు చెందిన పోతిరెడ్డి సందీప్ రెడ్డి కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్ జట్టు వియత్నాం, జపాన్‌పై నెగ్గి మూడో స్థానం సాధించింది. థారులాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈనెల 2న ప్రారంభమైన పోటీలు శుక్రవారం ముగిశాయి. ఆతిథ్య థారులాండ్ టైటిల్ కైవసం చేసుకోగా, ఫిలీప్పిన్స్ రన్నరప్‌గా నిలిచింది. భారత్‌తో పాటు జపాన్, వియత్నాం, ఫిలీప్పిన్స్, థారులాండ్ జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. భారత్ 21-14తో వియత్నాంపై, 26-18తో జపాన్‌పై గెలుపొందగా, ఫిలీప్పిన్స్ చేతిలో 24-18తో ఓటమి పాలైంది. 'జట్టు సమష్టిగా రాణించి మూడో స్థానంలో నిలిచింది. రానున్న ఆసియా లీగ్‌లో కచ్చితంగా ట్రోఫీ సాధిస్తామనే నమ్మకం ఉంది' అని కెప్టెన్ సందీప్ రెడ్డి అన్నాడు. జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేసిన కోచ్ ప్రవీణ్ రెడ్డి.. జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారే కావడం గర్వంగా ఉందని అన్నారు.