Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ రాచెల్ హేన్స్లకు వరించాయి. మార్చి నెలకు గానూ వీరిద్దరిని ఎంపిక చేసినట్లు ఐసిసి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్ ఆజమ్ ఒక సెంచరీ, రెండు అర్ధ శతకాల సాయంతో 390 పరుగులు సాధించాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 196 పరుగులు చేసి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఐసిసి అవార్డు గెలుచుకొని క్రమంలో వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్ కమిన్స్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో రాచెల్ హేన్స్ కీలక పాత్ర పోషించింది. టోర్నమెంట్లో మొత్తం 429 పరుగులు చేసిన హేన్స్.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 130 పరుగులు చేసి టైటిల్ గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ అలిస్సా హేలీ, ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లేస్టోన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్డ్‌లను వెనక్కి నెట్టి అవార్డు దక్కించుకుంది.