Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డుస్థాయిలో ప్రేక్షకులు హాజరు
మెల్బోర్న్: రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రికి రికార్డుస్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. వారంతంలో భాగంగా ఆల్బర్ట్ పార్క్లో ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రిని చూసేందుకు రికార్డుస్థాయిలో 4లక్షల 20వేల మంది ప్రేక్షకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. దీంతో గ్రాండ్ ఫ్రి సర్క్యూట్లో ఇది సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు, క్రీడా చరిత్రలో అత్యధికమంది ప్రేక్షకులు హాజరైన తొలి క్రీడగా ఆస్ట్రేలియన్ గ్రాండ్ నిలిచినట్లు వారు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా 2020, 2021లో జరగాల్సిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రి రెండేళ్ల తర్వాత మెల్బోర్న్తో తిరిగి ప్రారంభమైంది. ఈ పోటీల్లో మొనాకోకు చెందిన చార్లెస్ లెక్లెర్క్(ఎఫ్-1-75 ఫెరారీ) విజేతగా నిలిచాడు.