Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా చేసిన ట్వీట్‌పై బిసిసిఐ అపైక్స్ కౌన్సిల్ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు బిసిసిఐ సోమవారం ప్రకటించింది. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఈనెల 23న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సాహా ఫిబ్రవరిలో ఒక జర్నలిస్ట్ తనను బెదిరించాడని ఆరోపిస్తూ ట్వీట్ చేయగా.. సాహా ఆరోపణలపై విచారణకు బిసిసిఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌తోపాటు అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభుతేజ్ భాటియాతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. గతంలో సాహా ట్విటర్ వేదికగా ఓ జర్నలిస్ట్ తనపై బెదిరింపులకు పాల్పడినట్లు బిసిసిఐ రిపోర్టు చేసాడు.