Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోర్ట్ ఎలిజిబెత్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో, ఆఖరి టెస్ట్‌లో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు ఇద్దరు కరోనా బారిన పడ్డారు. సఫారీ జట్టు ఓపెనర్, సరెల్ ఎర్వీ, ఆల్‌రౌండర్ వివాన్ ముల్డర్‌కు కరోనా సోకినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. బంగ్లాదేశ్‌తో రెండోటెస్ట్ సందర్భంగా వీరిద్దరూ నాల్గోరోజు ఆట మధ్యలో మైదానాన్ని వీడారని, తాజాగా పరీక్షల్లో వీరికి కరోనా లక్షణాలున్నట్లు తేలినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లోనూ ఎర్వీ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. ఎర్వీ ఈ టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా... ముల్డర్ రెండో టెస్ట్ మధ్యలో మైదానాన్ని వీడాడు. దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండోటెస్ట్‌లో దక్షిణాఫ్రికా జట్టు 332పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ కేశవ్ మహరాజ్‌కు లభించింది.