Authorization
Thu April 10, 2025 08:51:27 pm
- గుజరాత్ జెయింట్స్ 162/7
డివైపాటిల్(ముంబయి): ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15లో సన్‌రైజర్స్ బౌలర్లు మరోసారి చెలరేగారు. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్స్ నటరాజన్(2/34), భువనేశ్వర్(2/37)కి తోడు జెన్సన్, ఉమ్రన్ మాలిక్ కూడా చెలరేగారు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్(7)ను భువనేశ్వర్, సాయి సుదర్శన్(11)ను నటరాజన్ పెవీలియన్‌కు పంపారు. వేడ్(19) కూడా నిరాశపర్చడంతో ఆ జట్టు 64పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ హార్దిక్(50నాటౌట్) అర్ధసెంచరీకి తోడు అభినవ్ మనోహర్(35) రాణించారు. గుజరాత్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్(12) కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన నటరాజన్ ఆ ఓవర్‌లో తెవాటియా(6), రషీద్ ఖాన్(0)ను ఔట్ చేసి గుజరాత్ జట్టు భారీస్కోర్ చేయకుండా నిరోధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌కు రెండేసి, జెన్సన్, ఉమ్రన్ మాలిక్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు...
గుజరాత్ జెయింట్స్: వృద్ధిమాన్ సాహా (ఎల్‌బి) ఉమ్రన్ మాలిక్ 19, శుభ్‌మన్ (సి)త్రిపాఠి (బి)భువనేశ్వర్ 7, సాయి సుదర్శన్ (సి)విలియమ్సన్ (బి)నటరాజన్ 11, హార్దిక్ (నాటౌట్) 50, మిల్లర్ (సి)అభిషేక్ (బి)జెన్సన్ 12, మనోహర్ (సి)త్రిపాఠి (బి)భువనేశ్వర్ 35, తెవాటియా (రనౌట్) పూరన్/నటరాజన్ 6, రషీద్ ఖాన్ (బి)నటరాజన్ 0, అదనం 22. (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 162పరుగులు.
వికెట్ల పతనం: 1/24, 2/47, 3/64, 4/104, 5/154, 6/161, 7/162
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-2, జెన్సన్ 4-0-27-1, సుందర్ 3-0-14-0, నటరాజన్ 4-0-34-2, ఉమ్రన్ మాలిక్ 4-0-39-1, మార్క్రమ్ 1-0-9-0.