Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలో 2026 కామన్వెల్త్ క్రీడలు
లండన్: కామన్వెల్త్ క్రీడా సంబరాలకు మరోసారి ఆస్ట్రేలియా వేదిక కానుంది. ఆసీస్‌లోని విక్టోరియా రాష్ట్రంలో 2026 మార్చిలో కామన్వెల్త్ క్రీడోత్సవాలు నిర్వహించాలని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) నిర్ణయించింది. ఒకే నగరానికి పరిమితం కాకుండా వివిధ నగరాల్లో క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు.. మెల్బోర్న్, గీలాంగ్, బెండిగో, బల్లారట్, గిప్స్లాండ్ నగరాల్లో క్రీడా పోటీలు జరుగనున్నాయి. టోర్నీ ప్రారంభోత్సవం ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో అట్టహాసంగా జరుగనుంది. మొత్తం 16 క్రీడాంశాల్లో పోటీలు ఉండనుండగా.. వాటిలో టీ20 క్రికెట్ టోర్నీకి స్థానం దక్కడం విశేషం. 2018లో గోల్డ్‌కోస్ట్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగిన సంగతి తెలిసిందే.