Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపిక ప్రక్రియకు దూరం
న్యూఢిల్లీ: రెండు సార్లు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెలక్షన్ ట్రయల్స్ నుంచి వైదొలిగింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు అర్హత సాధించేందుకు నిర్వహించే ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని లండన్ ఒలింపిక్స్ పతక విజేత నిర్ణయించుకుంది. ఈ మేరకు బ్యాడ్మింటన్ సంఘానికి సమాచారం అందించింది. 32 ఏండ్ల సైనా ప్రస్తుతం గాయాలతో సతమతమవుతున్నది. ఫామ్‌లో కోల్పోవటమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇండియా, జర్మన్ ఆల్ ఇంగ్లాండ్, స్విస్ ఓపెన్ టోర్నీల్లో రెండో రౌండ్‌ను దాటలేదు. ఈ నేపథ్యంలోనే ట్రయల్స్‌కు దూరమైంది.
15 నుంచి ట్రయల్స్ : ఈనెల 15 నుంచి 20 మధ్య ట్రయల్స్ జరుగనున్నాయి. కామన్వెల్త్ క్రీడలకు మహిళలు, పురుషుల విభాగంలో పది మంది చొప్పున , ఆసియా, థామస్ కప్, ఉబర్ కప్ టోర్నీకి 20 మంది చొప్పున క్రీడాకారులకు ఎంపిక చేయనున్నారు. ట్రయల్స్‌లో సత్తా చాటిన వారు మెగాటోర్నీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.