Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీతో పోరుకు టీమ్ ఇండియా రెఢీ
- ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్
భువనేశ్వర్ : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో అగ్రస్థానం మరింత పదిలం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మక లీగ్‌లో సొంతగడ్డపై చివరి పోరులో జర్మనీతో టీమ్ ఇండియా తలపడనుంది. పది మ్యాచుల్లో 21 పాయింట్లు సాధించిన భారత్ అగ్రస్థానంలో ఉండగా.. 8 మ్యాచుల్లో 17 పాయింట్లతో జర్మనీ ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. 22 మందితో కూడిన జర్మనీ జట్టులో ఏకంగా 12 మంది ఆటగాళ్లు కొత్తవారే. సీనియర్ ఆటగాళ్లు క్లబ్ మ్యాచుల్లో బిజీగా ఉండటంతో భారత్‌తో మ్యాచ్‌కు కుర్రాళ్లకు అవకాశం లభించింది. రానున్న ప్రపంచకప్, 2024 పారిస్ ఒలింపిక్స్ దృష్టిలో ఉంచుకుని జర్మనీ యువ ఆటగాళ్లకు ఓ అవకాశం కల్పించింది. నెదర్లాండ్స్‌తో 2-1, 1-3తో మిశ్రమ ఫలితం చవిచూసిన భారత్.. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. జర్మనీతో మ్యాచ్ అనంతరం భారత్ విదేశీ గడ్డపై ఆడాల్సి ఉంది. కుర్రాళ్లు నిరూపించుకునేందుకు తహతహ లాడుతారు. యువ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నాడు. ఏప్రిల్ 14, 15న భారత్, జర్మనీలు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో తలపడనున్నాయి.