Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-1తో జర్మనీపై భారత్ గెలుపు
- ఎఫ్ఐహెచ్ హకీ ప్రో లీగ్
భువనేశ్వర్ : హాకీ ఇండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. అనుభవం లేని జర్మనీ జట్టుపై టీమ్ ఇండియా తిరుగులేని విజయం నమోదు చేసింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో జర్మనీపై భారత్ డబుల్ ధమాకా నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో 3-0తో చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో 3-1తో తిరుగులేని విజయం సాధించింది. సుఖ్జిత్ సింగ్ (19వ నిమిషం), వరుణ్ కుమార్ (41వ నిమిషం), అభిషేక్ (54వ నిమిషం)లు భారత్‌కు గోల్స్ కొట్టారు. జర్మనీ తరఫున ఆంటోన్ బెకెల్ 45వ నిమిషంలో ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ ముగింపు వరకు భారత ఆధిపత్యం నడిచిన మ్యాచ్‌లో జర్మనీ తేలిపోయింది. చివరి ఐదు నిమిషాల్లో పెనాల్టీ కార్నర్ కోసం జర్మనీ ఆటగాళ్లు గట్టిగా ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ విజయంతో 12 మ్యాచుల్లో భారత్ 27 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సీనియర్ ఆటగాళ్లు క్లబ్ బాధ్యతల్లో ఉండగా.. యువకులతో కూడిన జట్టును భారత్‌కు పంపించిన జర్మనీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. జర్మనీతో మ్యాచ్‌తో ప్రొ లీగ్‌లో భారత్ సొంతగడ్డ మ్యాచులు ముగిశాయి. ఇక నుంచి భారత్ విదేశీ గడ్డపై ప్రత్యర్థులను ఎదుర్కొవాల్సి ఉంటుంది.