Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదికపై త్వరలో నిర్ణయం : జై షా
న్యూఢిల్లీ : ద్వీపదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అత్యంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న శ్రీలంక ఈ ఏడాది ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకలో ఓ అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహణకు అనువైన పరిస్థితులు కనిపించటం లేదు. దీంతో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ 2022 జరగాల్సి ఉండగా.. నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఐపీఎల్ తుది పోరు రోజు నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. 'శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పరిస్థితులు, క్రికెట్‌పై ప్రభావంపై శ్రీలంక అధికారులతో సవివరంగా మాట్లాడాను. ఆసియా కప్ నిర్వహణపై శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మకంగా ఉంది. ఐపీఎల్ ఫైనల్స్ రోజు (మే 29) శ్రీలంక క్రికెట్ అధికారులు ఇక్కడికి రానున్నారు. ఆ రోజు పూర్తి స్థాయిలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని' జై షా వెల్లడించాడు.