Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రిమి యర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా మూడో విజయాన్ని సాధించి హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175పరుగులు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్ జట్టు 17.5ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176పరుగులు చేసి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాటర్స్ వెంకటేశ్ అయ్యర్(6), ఫించ్(7), నరైన్(6) నిరాశపర్చినా.. ఆ తర్వాత నితీశ్ రాణా(54) అర్ధసెంచరీకి తోడు.. చివర్లో ఆండీ రసెల్(49నాటౌట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోల్‌కతా 70 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నితీశ్ రాణా క్రీజులో కుదురుకొని ఆండీ రసెల్‌తో కలిసి జట్టును గాడిలో పెట్టాడు. నితీశ్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. నితీశ్ ఔటయ్యాక పాట్ కమిన్స్(3), అమన్ హకీమ్(5) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. చివర్లో రసెల్ బ్యాట్‌కు పని చెప్పాడు. ఇన్నింగ్స్ చివరి మూడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టడంతో కోల్‌కతా జట్టు 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రసెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్‌కు 3, ఉమ్రాన్ మాలిక్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(3), కెప్టెన్ విలియమ్సన్(17) నిరాశపర్చినా.. త్రిపాఠి(71పరుగులు; 37బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మార్క్రమ్(68నాటౌట్; 36బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిసాడు. పూరన్(5నాటౌట్) రాణించడంతో సన్‌రైజర్స్ జట్టు 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 1176పరుగులు చేసి విజయం సాధించింది. రసెల్‌కు రెండు, కమిన్స్‌కు ఒక వికెట్ లభించాయి.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్: వెంకటేశ్ అయ్యర్ (బి)నటరాజన్ 6, ఫించ్ (సి)పూరన్ (బి)జాన్సన్ 7, శ్రేయస్ (బి)ఉమ్రన్ మాలిక్ 28, నరైన్ (సి)శశాంక్ సింగ్ (బి)నటరాజన్ 6, నితీశ్ రాణా (సి)పూరన్ (బి)నటరాజన్ 54, జాక్సన్ (సి)నటరాజన్ (బి)ఉమ్రన్ మాలిక్ 7, రస్సెల్ (నాటౌట్) 49, కమిన్స్ (సి)జాన్సన్ (బి)భువనేశ్వర్ 3, హకీమ్ ఖాన్ (బి)సుచిత్ 5, ఉమేశ్ (నాటౌట్) 1, అదనం 9. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 175పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/25, 3/31, 4/70, 5/103, 6/142, 7/153, 8/158
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-1, జాన్సన్ 4-0-26-1, నటరాజన్ 4-0-37-3, ఉమ్రన్ మాలిక్ 4-0-27-2, శశాంక్ సింగ్ 1-0-10-0, సుచిత్ 3-0-32-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ (బి)కమిన్స్ 3, విలియమ్సన్ (బి)రసెల్ 17, త్రిపాఠి (సి)వెంకటేశ్ అయ్యర్ (బి)రసెల్ 71, మార్క్రమ్ (నాటౌట్) 68, పూరన్ (నాటౌట్) 5, అదనం 12. (17.5ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 176పరుగులు.
వికెట్ల పతనం: 1/3, 2/39, 3/133
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4-0-31-0, కమిన్స్ 3.5-0-40-1, రసెల్ 2-0-20-2, హకీమ్ ఖాన్ 1-0-13-0, వరుణ్ చక్రవర్తి 3-0-45-0, నరైన్ 4-0-23-0.