Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గచ్చిబౌలి క్రీడా సముదాయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శనివారం నుంచి వచ్చే మే 31వ తేదీ వరకు మొత్తం 45 రోజులు పాటు జరగనున్న ఈ సమ్మర్ క్యాంప్‌ను జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు, సారు అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి కలిగిస్తే చాంపియన్లుగా తయారవుతారని చెప్పారు. క్రీడలతో ఆరోగ్యం, ఉల్లాసం,క్రమశిక్షణతో పాటు మానసికంగా కూడా ధడంగా తయారవుతార ని వారు అన్నారు.అనంతరం గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ నందకిశోర్ గోకుల్ మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, స్కేటింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. టేబుల్ టెన్నిస్‌తో పాటు మరో రెండు క్రీడాంశాల్లో కూడా శిక్షణ శిబిరం నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పీడీ రాజేష్, గచ్చిబౌలి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.