Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ టోర్నీలో భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ స్వర్ణం, యువ స్విమ్మర్ వేదాంత్ మాధవన్ రజతం చేజిక్కించుకున్నారు. కోపెన్హెగన్ వేదికగా జరిగిన టోర్నీ 200 మీటర్ల బటర్క్ఫ్లె ఈవెంట్లో ప్రకాశ్ 1.59.27 సెకండ్లలో లక్ష్యం పూర్తి చేసి విజేతగా నిలిచాడు. సాజన్కు ఇది ఈ ఏడాది తొలి అంతర్జాతీయ పతకం. అంతకుముందు 'ఏ' ఫైనల్లో సాజన్ 2.03.67 సెకండ్లలో లక్ష్యం పూర్తి చేసి అర్హత సాధించాడు. 1500 మీటర్ల ఫ్క్రీస్టెల్ ఈవెంట్లో ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తనయుడు వేదాంత్ 15.57.86 సెకండ్లలో లక్ష్యం చేరి రజతం పొందాడు. నిరుడు లతీవా ఓపెన్లో కాంస్యం పొందిన వేదాంత్ అదే ఏడాది జరిగిన జూనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్షిప్లో ఏడు మెడల్స్ (4 రజతం, 3 కాంస్యం)తో సత్తా చాటాడు. 'ఈనెలలో మరిన్ని పోటీలు ఉన్నాయి. భవిష్యత్ టోర్నీలకు డెన్మార్క్ ఓపెన్ సన్నాహాకంగా దోహదం చేస్తుంది. కామన్వెల్త్, ఆసియా క్రీడల వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాం' అని ప్రకాశ్ తెలిపాడు. 'బి' ఫైనల్ మహిళల 400 మీటర్ల విభాగంలో భారత్కు చెందిన శక్తి బాలకష్ణన్ (5.10:71 సె) రెండో స్థానంలో నిలువగా.. 50 మీటర్ల ఫ్క్రీస్టెల్లో (24.29 సెకండ్లు) తనీశ్ జార్జ్ మ్యాథ్యూ 29వ స్థానంలో నిలిచాడు. తన కుమారుడికి పతకం రావడంపై నటుడు మాధవన్ హర్షం వ్యక్తం చేశాడు.