Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరుగనున్న తొలి పోరులో పంజాబ్ కింగ్స్‌తో రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. తాజా సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన హైదరాబాద్.. ఆ తర్వాత 'హ్యాట్రిక్' విజయాలు నమోదు చేసుకుంది. ఎప్పట్లాగే బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణిస్తుంటే.. టాపార్డర్ గాడిన పడటంతో సన్‌రైజర్స్ తిరుగులేకుండా సాగుతున్నది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ మంచి టచ్‌లో ఉండగా.. గత మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి విశ్వరూపం కనబర్చాడు. మార్క్రమ్ కూడా మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ తన వంతు కోసం ఎదురుచూస్తున్నాడు. బౌలింగ్‌లో సీనియర్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ పేస్ భారం మోస్తుండగా.. జాన్సెన్ వారికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన బంతులేస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ నుంచి పంజాబ్‌కు ముప్పు పొంచి ఉంది. వేగంతో పాటు కచ్చితత్వంతో బంతులిసురుతున్న ఉమ్రాన్.. పరుగుల నియంత్రణపై కూడా దష్టి పెడితే జట్టుకు మరింత ప్రయోజనం కలుగనుంది. ప్రధాన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోగా.. సుచిత్, శశాంక్ ఐదో బౌలర్ కోటాను పూర్తి చేయనున్నారు. మరోవైపు పడుతూ లేస్తూ సాగుతున్న పంజాబ్.. రైజర్స్ జోరుకు బ్రేక్ వేయాలని తహతహలాడుతున్నది.