Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కెంట్ కౌంటీ మాజీ కెప్టెన్ రాబ్ కీ ఇంగ్లాండ్ క్రికెట్లో కీలక స్థానంలో నియమితుల య్యాడు. జాతీయ జట్టు వరుస వైఫల్యాలతో ఇంగ్లాండ్ క్రికెట్ ప్రస్తుతం కష్టాల్లో కూరుకుంది. సీనియర్ మెన్స్ జట్టులో కెప్టెన్ సహా సహాయక కోచింగ్ విభాగంలో కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్గా రాబ్ కీ నియమితులయ్యాడు. ' సీనియర్ మెన్స్ జట్టు ప్రణాళికల్లో రాబ్ కీ కీలక పాత్ర పోషిస్తాడు. జట్టు ప్రదర్శన పట్ల అతడే బాధ్యత వహిస్తాడు. త్వరలోనే జరుగున్న సమీక్ష ప్రక్రియలోనూ రాబ్ కీ ముఖ్య పాత్ర పోషిస్తాడు' అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. కెప్టెన్సీపై ఆసక్తి లేదు : ఇంగ్లాండ్ వరుస పరాజయాల నేపథ్యంలో ఆ జట్టు అత్యంత విజయవంతమైన టెస్టు సారథి జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నూతన టెస్టు సారథిగా ఎంపిక కావటం లాంఛనమే అయినా.. సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పేరు సైతం కెప్టెన్సీ రేసులో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీపై ఆసక్తి లేదని బ్రాడ్ తెలిపాడు. 'కెప్టెన్సీ రేసులో నా పేరు ఉందనే విషయం తెలుసు. వార్షిక కాంట్రాక్టు, విశేష అనుభవంతోనే నా పేరు వినిపిస్తోంది. కెప్టెన్సీపై నాకు ఎటువంటి ఆలోచన లేదు. నా ఆలోచన అంతా వికెట్ల వేటలో ఇంగ్లాండ్ విజయానికి ఎలా ఉపయోగపడాలనేనని' స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు.