Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చలు జరుపుతున్న బాయ్
న్యూఢిల్లీ : భారత డబుల్స్ సర్క్యూట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన శిక్షకుడు, టోక్యో ఒలింపిక్స్‌లో డబుల్స్ జోడీని సంచలనం దిశగా నడిపించిన గురువు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ దిగ్గజం మథియస్ బోయె మరోసారి భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్‌గా రానున్నాడు. ఈ మేరకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు) మథియస్ బోయెతో చర్చలు జరుపుతుంది. లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మథియస్ బోయె.. గత కొన్నేండ్లలో భారత డబుల్స్ క్రీడాకారులకు శిక్షణ అందించాడు. మథియస్ బోయె శిక్షణలోనే చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి జంట టోక్యో ఒలింపిక్స్ గ్రూప్ దశలో రెండు విజయాలు నమోదు చేసింది. ఇతర సమీకరణాలతో అనూహ్యంగా నాకౌట్ బెర్త్ చేజార్చుకుంది. టోక్యో ఒలింపిక్స్ అనంతరం మథియస్ బోయె పూర్తి స్థాయి కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మలేషియా కోచ్ టాన్ కిమ్ హర్‌తో బారు ఐదేండ్ల కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుంది. 2026 ఆసియా క్రీడల వరకు టాన్ కిమ్ హర్ బారుతో పని చేయాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో అతడు కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో బారు వర్గాలు తాజాగా మథియస్ బోయెతో చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ముంబయిలో ఉన్న మథియస్ బోయె వద్ద సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రత్యేక్ష శిక్షణ పొందుతున్నారు. ' టాన్ కిమ్‌ను కొనసాగేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. క్రీడా మంత్రిత్వ శాఖ, సారు ఆమోదం సైతం లభించింది. కానీ ఆఫర్‌ను టాన్ కిమ్ తిరస్కరించారు. ప్రస్తుతం మథియస్ బోయెతో చర్చలు జరుపుతున్నాం. ఇంకా ఏదీ తేలలేదు. బోయె అనుభవం డబుల్స్ క్రీడాకారులకు గొప్పగా ఉపయోగపడుతుంది' అని బారు కార్యదర్శి సంజరు మిశ్రా తెలిపారు.