Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్, యువ క్రీడాకారుడు విశ్వ దీన్‌దయాళ్ (18) ఆదివారం మేఘాలయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోమవారం మొదలు కానున్న 83వ సీనియర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ కోసం గువహటి నుండి షిల్లాంగ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టిటిఎఫ్‌ఐ) తెలిపింది. ఎదురుగా వస్తున్న 12 చక్రాల వాహనం.. రోడ్డు డివైడర్‌ను ఢకొీని, క్రీడాకారులు వెళుతున్న వాహనాన్ని ఢకొీట్టిందని పేర్కొంది. టాక్సీ డ్రైవర్ అక్కడిక్కడే చనిపోగా.. గాయపడ్డ విశ్వాను నార్త్ ఈస్ట్రన్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించింది. విశ్వా తన మరో ముగ్గురు సహచర క్రీడాకారులతో వెళుతుండగా... ఈ ఘటన చోటుచేసుకుంది. రమేష్ సంతోష్ కమార్, అభినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్, కిశోర్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. దీన్‌దయాళ్ చెస్ విభాగంలో పలు జాతీయ ర్యాంకింగ్స్ టైటిల్స్‌తోపాటు అంతర్జాతీయ ట్రోఫీలను సాధించాడు. 27న ఆస్ట్రియాలోని లింజ్లో జరగనున్న డబ్ల్యుటిటి యూత్ కంటెండర్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. దీన్‌దయాళ్ మృతికి తమిళనాడు, మేఘాలయ హర్యానా ముఖ్యమంత్రులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.