Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోపెన్హగెన్(డెన్మార్క్): డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ పోటీల్లో భారత్ యువ స్విమ్మర్ వదంత్ మాధవన్ స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల 800మీ. ఫ్రిస్టైల్ స్విమ్మింగ్ ఫైనల్లో మాధవన్ 8నిమిషాల 17.28సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లోనే డెన్మార్క్‌కు చెఇందిన అలెగ్జాండర్ 0.10సెకన్ల వ్యత్యాసంతో రెండోస్థానానికి పరిమితమై రజత పతకానికే పరిమితమయ్యాడు. 16ఏళ్ల మాధవన్ అత్యుత్తమ ప్రదర్శకంటే 11.48సెకన్ల ఆలస్యంగా గమ్యానికి చేరిన అందరకంటే ముందు గమ్యానికి చేరాడు. ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అమెరికాకు చెందిన రాబర్ట్(7:41.87సె.)కాగా.. ప్రపంచ రికార్డు సమయం 7:32.12సెకన్లుగా ఉంది. ఈ మీట్లోనే మాధవన్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలను నమోదు చేయడం విశేషం.