Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ మహిళల టి20 లీగ్
రాంచీ: సీనియర్ మహిళల టి20 లీగ్‌లో హర్యానా జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం నుంచి ప్రారంభమైన టి20 ట్రోఫీలో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని పంజాబ్ జట్టుపై షెఫాలీ వర్మ ప్రాతినిధ్యం వహిస్తోన్న హర్యానా జట్టు విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్(64నాటౌట్) రాణించింది. ఛేదనలో హర్యానా జట్టు 19.2ఓవర్లలోనే ఛేదించింది. షెఫాలీ వర్మ(50; 23బంతుల్లో; 3సిక్సర్లు; 7ఫోర్లు) రాణించగా.. సుమన్ గుయిలా(31), మాన్సి జోషి(25నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 64పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్, కెప్టెన్ స్నేV్‌ా రాణా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. రైల్వేస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. హిమాచల్ ప్రదేశ్ జట్టు 19.2 ఓవర్లలో 117పరుగులకే కుప్పకూలింది.