Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిఛెల్ మార్ష్ సహా మరో నలుగురికి కరోనా
- ఆందోళనలో ఆర్సీబీ ఫ్రాంచైజీ
ముంబయి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మిఛెల్ మార్ష్ సహా మరో నలుగురు కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ జట్టు శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో మిఛెల్ మార్ష్ పాల్గొన్నాడు. మ్యాచ్ ప్రారంభ, ముగింపు సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్, హగ్గింగ్స్ చేసుకోవడం జరిగింది. దీంతో బెంగళూరు ఫ్రాంచైజీ తమ ఆటగాళ్ల పరిస్థితిపై ఆరాతీస్తోంది. మార్ష్‌కు తాజాగా జరిపిన ఆర్టీపిసిఆర్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఆ ఫ్రాంచైజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మార్ష్‌తోపాటు ఢిల్లీ ఫ్రాంచైజీ ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ కూడా కరోనా బారిన పడ్డాడు. అలాగే మరో నలుగురు ఆటగాళ్లలో కూడా కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు తేలడంతో వీరందరినీ ఐసోలేషన్‌కు తరలించినట్లు ఆ ఫ్రాంచైజీ వెల్ల డించింది. బిసిసిఐ ఢిల్లీ ఆటగాళ్ల రిపోర్టును మంగళవారం పరిశీలించనుంది. ఢిల్లీ జట్టు బుధవారం పంజాబ్ కింగ్స్‌తో పూణే వేదికగా మ్యాచ్‌లో పాల్గొనాల్సి ఉంది.