Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్తాన్ రాయల్స్ 217/5
బ్రాబౌర్న్(ముంబయి): ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో జోస్ బట్లర్ సెంచరీతో కదం తొక్కడంతో రాజస్తాన్ రాయల్స్ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217పరుగు భారీస్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ ఓపెనర్ బట్లర్-పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. తొలి వికెట్‌కు వీరిద్దరు కలిసి 9.4 ఓవర్లలో 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో పడిక్కల్(24)ను నరైన్ ఔట్ చేసినా.. రాజస్తాన్ బ్యాటర్స్ జోరు కొనసాగింది. ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్‌తో కలిసి బట్లర్ మరింత రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఐపీఎల్ తాజా సీజన్లో రెండో సెంచరీ నమోదు చేసాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బట్లర్ 61 బంతుల్లో 103 పరుగులు చేశాడు. బట్లర్ ఓ భారీ సిక్స్ తో సెంచరీ మార్కు అందుకోవడం విశేషం. బట్లర్ స్కోరులో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. బట్లర్ క్రీజులో ఉన్నంత సేపు ఏ దశలో రన్ రేట్ 10కి తగ్గలేదు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (24), కెప్టెన్ సంజు శాంసన్ (38)లతో బట్లర్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో షిమ్రోన్ హెట్మెయర్ (13 బంతుల్లో 26 నాటౌట్) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 200 మార్కు దాటింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా, పాట్ కమిన్స్ 1, ఆండ్రీ రస్సెల్ 1, శివం మావి 1 వికెట్ తీశారు.
స్కోర్‌బోర్డు...
రాజస్తాన్ రాయల్స్: జాస్ బట్లర్ (సి)చక్రవర్తి (బి)కమిన్స్ 103, పడిక్కల్ (బి) నరైన్ 24, సంజు (సి)శివమ్ మావి (బి)రసెల్ 38, హెట్మెయిర్ (నాటౌట్) 26, రియాన్ పరాగ్ (సి)శివమ్ మావి (బి)నరైన్ 5, కరణ్ నాయర్ (సి)కమిన్స్ (బి)శివమ్ మావి 3, అశ్విన్ (నాటౌట్) 2, అదనం 16. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 217పరుగులు.
వికెట్ల పతనం: 1/97, 2/164, 3/183, 4/189, 5/198
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4-0-44-0, శివమ్ మావి 4-0-34-1, చక్రవర్తి 2-0-30-0, కమిన్స్ 4-0-50-1, నరైన్ 4-0-21-2, రస్సెల్ 2-0-29-1.