Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఇక్కడ జరుగుతున్న గ్రీకో రోమన్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. మంగళవారంనుంచి ప్రారంభమైన రెజ్లింగ్ పోటీల్లో అర్జున్ హలకుర్కి, నీరజ్, సునీల్ కుమార్, కాంస్య పతకాలను సాధించారు. 55కిలోల విభాగం సెమీస్‌లో అర్జున్ 0-3 పాయింట్ల తేడాతో అలీ(ఇరాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. అర్జున్ 10-5తో ఇరాన్‌కు చెందిన అలీ నూర్బక్షును ఓడించాడు. క్వార్టర్ఫైనల్లో కజకిస్తాన్‌కు చెందిన బెకబోలాటోవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే కజకిస్తాన్ రెజ్లర్ ఫైనల్‌కు చేరుకోవడంతో కాంస్య పతక పోటీకి అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన కాంస్య పతక పోటీలో స్థానిక దావాబందీ ముంఖ్ ఎర్డెన్ను 10-7 పాయింట్ల తేడాతో ఓడించి తొలి పతకాన్ని భారత్‌కు ఖాయం చేశాడు. 63కిలోల విభాగంలో నీరజ్ 10-4తో కిర్గిస్తాన్‌కు చెందిన టైనార్ చేతిలో ఓడినా.. కిర్గిజ్ రెజ్లర్ ఫైనల్‌కు చేరడంతో నీరజ్ కాంస్య పతక పోటీకి అర్హత సాధించ గా.. ఈ పోటీలో మాజీ ఆసియా ఛాంపియన్ ఇస్లోమ్జోన్పై 7-4పాయింట్ల తేడాతో గెలిచి రెండో పతకాన్ని ఖాయం చేశాడు. ఆసియా మాజీ ఛాంపియన్ సునీల్ కుమార్ సెమీస్‌లో 5-3తో జపాన్‌కు చెందిన మసాటో సమీ చేతిలో ఓటమిపాలై కాంస్యానికే పరిమితమయ్యాడు. 87కిలోలు, 77కిలోలు విభాగాల్లో భారత రెజ్లర్లు సెమీస్‌కు చేరి పతక రేసులో ఉన్నారు.