Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిస్టియానో ఇంట విషాదమే కారణం!
లండన్: పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో లివర్పూల్తో మ్యాచ్కు దూరం కానున్నాడు. రొనాల్డో భార్య జార్జినా రోడ్రిగేజ్ ఇటీవల కవలలకు జన్మనివ్వగా.. వారికి పుట్టిన ఓ కుమారుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. 'మా కవలల్లో అమ్మాయి ప్రాణాలతో ఉండగా, అబ్బాయి మరణించినట్లు రోనాల్డో ఇన్స్టా పోస్టులో చేశాడు. అమ్మాయి ప్రాణాలతో ఉండడం తమకు ఆశను, సంతోషాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యం ధృవీకరించింది. అలాగే లివర్పూల్తో మ్యాచ్కు రొనాల్డో దూరం కానున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.