Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నోపై 18 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపు
డివై పాటిల్(ముంబయి): ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15లో డుప్లెసిస్ సూపర్ ఇన్నింగ్స్‌కి తోడు హేజిల్ వుడ్ బౌలింగ్‌లో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో విజయాన్ని సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఛేదనలో లక్నో జట్టు చివరి ఓవర్ వరకు ఆడి 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 163పరుగులే చేయగల్గింది. దీంతో ఆర్సీబీ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. తొలుత డుప్లెసిస్(96) తృటిలో మిస్ చేసుకున్నా.. మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్‌లో రాణించారు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ అనుజ్ రావత్ 4 పరుగులకే అవుట్ కాగా, విరాట్ కోహ్లీ(0) తానెదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు ఛమీరా ఖాతాలోకి చేరాయి. ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలో డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్ కలిసి మూడో వికెట్‌కు 37పరుగులు జత చేశారు. మ్యాక్స్ వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26)ల సహకారంతో డుప్లెసిస్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. డిప్లెసిస్ 64 బంతులు ఆడి 11ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి సెంచరీకి దగ్గర్లో ఔటయ్యాడు. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి స్టోయినిస్‌కు చిక్కాడు. లక్నో బౌలర్లలో దుష్మంత ఛమీరా, హోల్డర్‌కు రెండేసి, కృనాల్ పాండ్యాకు ఒక వికెట్ లభించాయి.
ఛేదనలో లక్నో ఓపెనర్లు డికాక్(7), మనీశ్ పాండే(6) నిరాశపర్చినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(30), కృనాల్ పాండ్యా(42) బ్యాటింగ్‌లో రాణించారు. చివర్లో స్టోయినీస్(24) మినహా మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. హేజిల్‌వుడ్‌కు నాలుగు, హర్షల్పటేల్కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో బెంగళూరు జట్టు 7మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.
స్కోర్‌బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: అనుజ్ రావత్ (సి)రాహుల్ (బి)ఛమీర 4, డుప్లెసిస్ (సి)స్టోయినీస్ (బి)హోల్డర్ 96, కోహ్లి (సి)దీపక్ హుడా (బి)ఛమీర 0, మ్యాక్స్‌వెల్ (సి)హోల్డర్ (బి)కృనాల్ పాండ్యా 23, ప్రభు దేశారు (సి)కృనాల్ పాండ్యా (బి)హోల్డర్ 10, షాబాజ్ అహ్మద్ (రనౌట్) రాహుల్/హోల్డర్ 26, దినేశ్ కార్తీక్ (నాటౌట్) 13, హర్షల్ పటేల్ (నాటౌట్) 0, అదనం 9. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 181పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/7, 3/44, 4/62, 5/132, 6/181
బౌలింగ్: ఛమీర 3-0-31-2, ఆవేశ్ ఖాన్ 4-0-33-0, కృనాల్ పాండ్యా 4-0-29-1, రవి బిష్ణోరు 4-0-47-0, హోల్డర్ 4-0-25-2, స్టోయినీస్ 1-0-14-0
లక్నో సూపర్‌జెయింట్స్: డికాక్ (సి)మ్యాక్స్‌వెల్ (బి)హేజిల్‌వుడ్ 3, కేఎల్ రాహుల్ (సి)కార్తీక్ (బి)హర్షల్ పటేల్ 30, మనీశ్ పాండే (సి)హర్షల్ పటేల్ (బి)హేజిల్‌వుడ్ 6, కృనాల్ పాండ్యా (సి)షాబాజ్ అహ్మద్ (బి)మ్యాక్్సవెల్ 42, దీపక్ హుడా (సి)ప్రభు దేశారు (బి)సిరాజ్ 13, ఆయుష్ బడోని (సి)కార్తీక్ (బి)హేజిల్‌వుడ్ 13, స్టోయినీస్ (బి)హేజిల్వుఉడ్ 24, హోల్డర్ (సి)సిరాజ్ (బి)హర్షల్ పటేల్ 16, ఛమీర (నాటౌట్) 1, రవి బిష్ణోరు (నాటౌట్) 0, అదనం 15. (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 163పరుగులు.
వికెట్ల పతనం: 1/17, 2/33, 3/64, 4/100, 5/108, 6/135, 7/148, 8/163
బౌలింగ్: మహ్మద్ సిరాజ్ 4-0-31-1, మ్యాక్స్‌వెల్ 2-0-11-1, హేజిల్‌వుడ్ 4-0-25-4, షాబాజ్ అహ్మద్ 4-0-25-0, హర్షల్ పటేల్ 4-0-47-2, హసరంగ 2-0-20-0