Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: డేవిస్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల బిడ్ దాఖలుకు దూరంగా ఉండాలని ఫ్రాన్స్ నిర్ణయించుకుంది. ఆర్థిక కారణాలరీత్యా ఈ ఏడాది డేవిస్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల బిడ్ దాఖలు నుంచి వైదొలుగుతున్నట్లు ఫ్రాన్స్ టెన్నిస్ సమాఖ్య(ఎఫ్ఎఫ్టి) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. డేవిస్ కప్ పోటీలను ప్రోత్సహించడానికి తమ సమాఖ్య ఎప్పుడూ సిద్ధంగా ఉందని, కానీ ఈసారి ఆర్ధిక, కరోనా నేపథ్యంలో బిడ్లను దాఖలు చేయలేమని ఫ్రెంచ్ బాడీ ఆ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఐటిఎఫ్) తొలుత సెప్టెంబర్ 14-18మధ్య జరిగే పురుషుల గ్రూప్ స్టేజ్ డేవిస్ కప్ పోటీలకు బోలోగ్నా, గ్లాస్గో, హాంబర్గ్, మలగాలను ఆతిథ్య హక్కులను అప్పగించింది. మలగా నవంబర్లో జరిగే డేవిస్ కప్ నాకౌట్ పోటీలకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. చారిత్రాత్మక డేవిస్ కప్ పోటీలు 1900 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే.