Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ స్పిన్నర్ మొష్రఫ్ హొసైన్(40) బుధవారం కన్నుమూశాడు. దీర్ఘకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హొసైన్ బుధవారం మరణించిన విషయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా ధృవీకరించింది. బంగ్లాదేశ్ తరఫున కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడిన హొసైన్.. 2008-16 కాలంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్భుత బౌలింగ్‌తో రాణించాడు. బంగ్లా తరఫున 3వేల పరుగులు, 300 వికెట్లు తీసిన 7వ క్రికెట్ హొసైన్. మొత్తమ్మీద 550 వికెట్లు తీసిన ఈ మాజీ ఎడమచేతి వాటం స్పిన్నర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 550 వికెట్లు పడగొట్టాడు. 2019లో బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అప్పటినుంచి క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడు. 2020నుంచి కీమోథెరపీ చేయించుకుంటున్నా కోలుకోలేకపోయాడు. రెండు వారాలు క్రితం హొసైన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. హొసైన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.