Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 27 నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోరీ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్ ఆటగాళ్లు తమ తమ దేశాల తరఫున టోర్నమెంట్లో ఆడేందుకు అనర్హులంటూ కీలక ప్రకటన జారీ చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 27 నుంచి జులై 10వ తేదీ వరకు జరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుండడమే అందుకు కారణం వారు పేర్కొన్నారు. రష్యాకు బెలారస్ సహకరిస్తున్న నేపథ్యంలో బెలారస్‌కు చెందిన క్రీడాకారులపైనా నిర్వాహకులు నిషేధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, రష్యా స్టార్ డానియేల్ మెద్వెదెవ్, బెలారస్ మహిళా టెన్నిస్ తార సబలెంక వింబుల్డన్‌లో పాల్గొనడంపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆయా దేశాల క్రీడాకారులు వ్యక్తిగతంగా టోర్నీలో పాల్గొనవచ్చని, దేశం పేరిట పాల్గొనేందుకు అనర్హులని వింబుల్డన్ యాజమాన్యం ఆ ప్రకటనలో పేర్కొంది. మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండగా, సబలెంక మహిళల ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నారు.