Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు జరిపిన ఆర్టీపిసిఆర్ టెస్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. కొవిడ్ బారినపడిన వ్యక్తి విదేశీ ఆటగాడని సమాచారం. ఢిల్లీ జట్టులో ఐదుగురు ఆటగాళ్లకు కొవిడ్ నిర్ధారణయిన కావడంతో పంజాబ్-ఢిలీ జట్లమధ్య బుధవారం జరిగే మ్యాచ్‌ను పుణే నుంచి ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియానికి మార్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొవిడ్ సోకిన ఆటగాళ్లలో ఫిజియోథెరపిస్ట్ ఫర్హాత్, చేతన్ కుమార్(స్టోర్ట్స్ మసాజ్ ఫిజియోథెరపిస్ట్), మిచెల్ మార్ష్, డాక్టర్ అభిజిత్ సాల్వీ(టీం డాక్టర్), ఆకాశ్ మానే(సోషల్ మీడియా కంటెంట్ టీం మెంబర్) ఉన్నట్లు బిసిసిఐ స్పష్టం చేసింది.