Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు క్యాన్సర్ బాధిత చిన్నారుల పట్ల ఉదారతను చాటారు. చిన్నారుల వైద్యానికి రూ. లక్ష విరాళం అందించారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఈఐ) మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆ సంస్థ నిర్వహించనున్న వైటథాన్ రన్ టీ - షర్ట్‌ను ఆవిష్కరించారు. అలాగే మూడేండ్లలోపు పిల్లలను కంటి కేన్సర్ నుంచి కాపాడాలని ఎల్వీపీఈఐ సంస్థ చేస్తున్న కార్యక్రమం ఉదాత్తమమైనదని కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎల్వీపీఈఓ వ్యవస్థాపకుడు, ట్రస్టీ బోర్డు ఛైర్మన్ గుళ్లపల్లి ఎన్ రావు మాట్లాడుతూ.. చిన్నారుల కంటి సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడానికి ఐసైట్ యూనివర్సల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఐ క్యాన్సర్ ద్వారా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు అవసరమైన నిధులను సేకరించడానికి వైట్‌థాన్ రన్ చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వైట్‌థాన్ రన్ వచ్చే నెల 8న నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజాలో జరగనుంది. ఇందులో పాల్గొలనాలనుకునేవారు https://www.ifinish.in/event_details /_Whitathonలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.