Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 115పరుగులకే కుప్పకూలిన పంజాబ్
- తొమ్మిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
బ్రాబౌర్న్(ముంబయి): ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. తొలుత ఢిల్లీ బౌలర్లు అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ జట్టు 115పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పృథ్వీ షా(41) ఔటైనా.. వార్నర్(60నాటౌట్), సర్ఫరాజ్(13నాటౌట్) మిగతా పని కానిచ్చారు. దీంతో ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడుతూ ఆడింది. శిఖర్ ధావన్(9)ను నాలుగో ఓవర్లో లలిత్ యాదవ్ అవుట్ చేయడంతో పంజాబ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కెప్టెన్ మయాంక్ అగర్వాల్(22) మరోసారి నిరాశపరిచాడు. విదేశీ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో (9), లియామ్ లివింగ్స్టన్(2) కూడా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కాసేపు జట్టును ఆదుకున్న జితేష్ శర్మ(32)ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ విజృంభించి.. ఒకే ఓవర్లో రబాడ(2), నాథన్ ఎలిస్(0)ను పెవిలియన్ చేర్చాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లోని ఏకైక సిక్సర్ బాదిన రాహుల్ చాహర్ (12)ను కూడా లలిత్ యాదవ్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి అర్షదీప్ సింగ్ (9) రనౌట్ అవడంతో పంజాబ్ ఆలౌట్ అయింది. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ దక్కాయి.
స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా-డేవిడ్ వార్నర్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (41)ను రాహుల్ చాహర్ అవుట్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు వార్నర్-పృథ్వీ షా కలిసి తొలి వికెట్‌కు 6.3ఓవర్లలో 83పరుగులు జతచేశారు. వార్నర్(60నాటౌట్; 30 బంతుల్లో 10ఫోర్లు, సిక్సర్), సర్ఫరాజ్(13నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.
స్కోర్‌బోర్డు..
పంజాబ్ కింగ్స్: మయాంక్ (బి)ముస్తఫిజుర్ 24, ధావన్ (సి)పంత్ (బి)లలిత్ యాదవ్ 9, బెయిర్‌స్టో (సి)ముస్తఫిజుర్ (బి)ఖలీల్ అహ్మద్ 9, లివింగ్‌స్టోన్ (స్టంప్) పంత్ (బి)అక్షర్ 2, జితేశ్ శర్మ (ఎల్బి) అక్షర్ 32, షారుక్ ఖాన్ (సి)పంత్ (బి)ఖలీల్ అహ్మద్ 12, రబడా (బి)కుల్దీప్ 2, నాథన్ ఎలీస్ (బి)కుల్దీప్ 0, రాహోల్ చాహర్ (బి)రువాన్ పావెల్ (బి)లలిత్ యాదవ్ 12, ఆర్ష్‌దీప్ సింగ్ (రనౌట్) పంత్ 9, వైభవ్ అరోరా (నాటౌట్) 2, అదనం 2. (20 ఓవర్లలో ఆలౌట్) 115పరుగులు.
వికెట్ల పతనం: 1/33, 2/35, 3/46, 4/54, 5/85, 6/90, 7/90, 8/92, 9/108, 10/115
బౌలింగ్: శార్దూల్ 2-0-20-0, ఖలీల్ అహ్మద్ 4-0-21-2, లలిత్ యాదవ్ 2-0-11-2, ముస్తఫిజుర్ 4-0-28-1, అక్షర్ 4-0-10-2, కుల్దీప్ 4-0-24-2.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి)నాథన్ ఎల్లీస్ (బి)రాహుల్ చాహర్ 41, డేవిడ్ వార్నర్ (నాటౌట్) 60, సర్ఫరాజ్ ఖాన్ (నాటౌట్) 12, అదనం 6. (10.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119పరుగులు.
వికెట్ల పతనం: 1/83
బౌలింగ్: వైభవ్ అరోరా 2-0-31-0, రబడా 3-0-35-0, ఆర్ష్‌దీప్ సింగ్ 1-0-17-0, నాథన్ ఎల్లీస్ 2-0-15-0, రాహుల్ చాహర్ 2.3-0-21-1.