Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పతక రేసులో నిఖత్, లౌల్లీనా బోర్గోహైన్
హైదరాబాద్: టర్కీలో జరిగే ఎలైట్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత బాక్సర్ల బృందం గురువారం బయల్దేరింది. మొత్తం 12మంది మహిళా బాక్సర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు బయల్దేరగా.. అంతులో హైదరాబాద్ సంచలనం నిఖత్ జరీన్‌తోపాటు టోక్కో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లౌల్లీనా బోర్గోహైన్ కూడా ఉన్నారు. ఈ ఏడాదే కామన్వెల్, ఆసియా గేమ్స్ ఉన్న దృష్ట్యా ఈ పర్యటన మన బాక్సర్లకు ఉపయుక్తం కానుంది. టర్కీ పర్యటన, బాక్సర్ల శిక్షణ కోసం భారత ప్రభుత్వం సుమారు 92.12లక్షల రూపాయలు ఖర్చుచేసింది. ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ.. టర్కీ పర్యటనలో తప్పక పతకం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో తాను అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నానని, ఈ పర్యటన కోసం కఠోర సాధన చేసినట్లు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని' చెప్పుకొచ్చింది. ఆసియా క్రీడల్లో నిఖత్, మనీష్ మౌన్(57కిలోలు), జాస్మిన్(60కిలోలు), లౌల్లీనా(69కిలోలు), సావిటీ బూరా(75కిలోలు) మహిళల జట్టు తరఫునుంచి బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు.