Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్
లండన్: రష్యా, బెలారస్ ఆటగాళ్లపై వింబుల్డన్ నిషేధంపై 20గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, టాప్‌సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ స్పందించాడు. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాన్ని 'పిచ్చి ఆలోచన' అంటూ ఎద్దేవా చేశాడు. వింబుల్డన్ నిర్వాహకులు బుధవారం ఈ రెండు దేశాల ఆటగాళ్లపై నిషేధం విధిస్తూ ప్రకటించడంతో జకోవిచ్ పై విధంగా తెలిపాడు. 'తాను 11ఏళ్ల వయసులో ఉండగా సెర్బియా రాజధానిపై యుగోస్లేవియా దాడులు చేసిందని, ఇలా 78రోజులపాటు నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్(నాటో) 78రోజుల పాటు దాడులకు పాల్పడిందన్నాడు. ఆ సందర్భంగా ఏ క్రీడా పోటీల్లోనూ ఆటగాళ్లను నిషేధంగానీ, దేశాలు ఆయా టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధంచడం జరగలేదని' పేర్కొన్నాడు. ఇప్పుడు అగ్రదేశాలు పనిగట్టుకొని క్రీడల్లో రాజకీయాల్ని మిళితం చేయడం సరికాదని ఘాటుగా విమర్శించాడు.