Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఖరి నాలుగు బంతుల్లో
- 16పరుగులు కొట్టిన మాజీ కెప్టెన్
- ఉత్కంఠపోరులో చెన్నై విజయం
- ప్లే ఆఫ్ రేసునుంచి ముంబయి నిష్క్రమణ
- ఐపిఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లయిన రోహిత్
డివైపాటిల్(ముంబయి)
ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15లో ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో గురువారం జరిగిన ఉత్కంఠపోరులో ముంబయి జట్టు 3వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి జట్టు చివరి బంతి వరకు ఆడి 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆఖరి 4బంతుల్లో 16పరుగులు చేయాల్సిన చెన్నై జట్టు... ధోనీ 6,4,2,4పరుగులు చేసి గెలిపించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయిపై చెన్నై బౌలర్లు చెలరేగారు. ముఖేష్ చౌదరి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబయి పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 42 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లేలో చెన్నై మూడు వికెట్లు పడగొట్టడం ఇది వరుసగా మూడోసారి. సూర్యకుమార్ యాదవ్(32), తిలక్‌వర్మ(51) షోకిన్(25) బ్యాటింగ్‌లో రాణించారు. పాలార్డ్(14), సామ్స్(5), ఉనాద్కట్(19) చివర్లో మెరిసాడు. అంతకుముందు జరిగిన నాలుగు మ్యాచుల్లో పవర్ ప్లేలో ఒక వికెట్ మాత్రమే తీసిన చెన్నై గత మూడు మ్యాచుల్లో విజృంభిస్తోంది.
ఛేదనలో చెన్నై జట్టు గైక్వాడ్(0) గోల్డెన్ డక్ అయ్యాడు. ఉతప్ప(30), రాయుడు(40)కి తోడు చివర్లో ధోనీ(28నాటౌట్; 13బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్) రాణించారు.
ఆదుకున్న తిలక్‌వర్మ
స్కోర్‌బోర్డులో పరుగుల ఖాతా తెరవకముందే కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు స్కోర్ 2పరుగులకే ఇషాన్ కిషన్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఈ క్రంలో ఫామ్‌లో ఉన్న డెవాల్డ్ బ్రెవిస్(4) కూడా చేతులెత్తేయడంతో ముంయి మరిన్ని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టును గాడినపెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి సంయమనంతో ఆడుతూ స్కోరు పెంచుకుంటూ పోయారు. సూర్యకుమార్ 32 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్ వర్మ చెలరేగాడు. బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. చివర్లో ఉనద్కత్ 9 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 19 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 155 పరుగులకు చేరుకుంది. కీరన్ పొలార్డ్ 14 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3, బ్రావో 2 వికెట్లు తీసుకున్నారు.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (సి)సాంట్నర్ (బి)ముఖేష్ చౌదరి 0, ఇషన్ కిషన్ (బి)ముఖేష్ చౌదరి 0, బ్రెవీస్ (సి)ధోనీ (బి)ముఖేష్ చౌదరి 4, సూర్యకుమార్ యాదవ్ (సి)ముఖేష్ చౌదరి (బి)సాంట్నర్ 32, తిలక్ వర్మ (నాటౌట్) 51, షోకీన్ (సి)ఊతప్ప (బి)బ్రేవో 25, పొలార్డ్ (సి)శివమ్ దూబే (బి)తీక్షణ 14, సామ్స్ (ఎల్బి) బ్రేవో 5, ఉనాద్కట్ (నాటౌట్) 19, అదనం 5. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 155పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/2, 3/23, 4/47, 5/85, 6/111, 7/120
బౌలింగ్: ముఖేష్ చౌదరి 3-0-19-3, సాంట్నర్ 3-0-16-1, తీక్షణ 4-0-35-1, జడేజా 4-0-30-0, ప్రెటోరియస్ 2-0-17-0, బ్రేవో 4-0-36-2.
చెన్నై సూపర్‌కింగ్స్: గైక్వాడ్ (సి)తిలక్ వర్మ (బి)సామ్స్ 0, ఊతప్ప (సి)బ్రెవీస్ (బి)ఉనాద్కట్ 30, సాంట్నర్ (సి)ఉనాద్కట్ (బి)సామ్స్ 11, రాయుడు (సి)పొలార్డ్ (బి)సామ్స్ 40, శివమ్ దూబే (సి) ఇషన్ కిషన్ (బి)సామ్స్ 13, జడేజా (సి)తిలక్ వర్మ (బి)మెరిడిత్ 3, ధోనీ (నాటౌట్) 28, ప్రిటోరియస్ (ఎల్బి) ఉనాద్కట్ 22, బ్రేవో (నాటౌట్) 1, అదనం 8, (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 156 పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/16, 3/66, 4/88, 5/105, 6/106, 7/139
బౌలింగ్: సామ్స్ 4-0-30-4, బుమ్రా 4-0-29-0, మెరిడిత్ 4-0-25-1, ఉనాద్కట్ 4-0-48-2, షోకీన్ 4-0-23-0