Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్
ఉలాన్బాతర్(మంగోలియా): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. శుక్రవారం జరిగిన పోటీల్లో అన్షు మాలిక్, మనీష ఆయా విభాగాలను పతకాలను సాధించారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన రెజ్లింగ్ 57కిలోల విభాగంలో అన్షు మాలిక్ ఫైనల్‌కు చేరి ఓటమిపాలైంది. ఇక 62కిలోల విభాగంలో మనీష కాంస్యపతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో డిఫెడింగ్ ఛాంపియన్ అన్షు 0-4పాయింట్ల తేడాతో టెక్నికల్ సుపీరియారిటీలో 0-4పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన సుగుమీ చేతిలో ఓటమిపాలైంది. దీంతో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. 2020లో కాంస్య పతకం నెగ్గిన అన్షు.. ఆల్మట్టిలో గత ఏడాది జరిగిన పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. మనీష కాంస్య పతక పోటీలో కొరియాకు చెందిన హన్బెట్ లీపై 4-2పాయింట్ల తేడాతో గెలిచి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.