Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రాజస్థాన్ రాయల్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయాడు. హోటల్లో పాంటింగ్‌తో పాటు ఉంటున్న కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా బారినపడడంతో పాంటింగ్ ఐసోలేషన్లోకి వెళ్లాడు. దీంతో గురు, శుక్రవారాల్లో ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. పాంటింగ్‌కు రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్‌గానే వచ్చినప్పటికీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాంటింగ్‌ను ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాలని మేనేజ్మెంట్, మెడికల్ టీం నిర్ణయించింది. దీంతో నేటి మ్యాచ్‌కు పాంటింగ్ దూరంగా ఉండనున్నాడు. పాంటింగ్ అందుబాటులో లేకపోవడంతో జట్టు సహాయ సిబ్బంది ప్రవీణ్ ఆమ్రే, అజిత్ అగార్కర్, జేమ్స్ హోప్స్, షేన్ వాట్సన్ బ్యాక్ రూమ్ వ్యూహాలను రచించనున్నారు. ఢిల్లీ జట్టులో టిమ్ సీఫెర్ట్, మిచెల్ మార్ష్‌తోపాటు నలుగురు సహాయక సిబ్బంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.