Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: రష్యా స్విమ్మర్, ఒలింపిక్ స్వర్ణపతక విజేత ఎవ్జెనీ ర్లోవ్‌పై అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ (ఫినా) నిషేధం విధించింది. 9 నెలలపాటు ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా మాస్కోలో జరిగిన ర్యాలీలో పాల్గొనడమే ఎవ్జెనీ ర్లోవ్‌పై నిషేధానికి కారణంగా తెలుస్తోంది. టొక్యో ఒలింపిక్స్‌లో ర్లోవ్ ఒక స్టార్‌గా నిలిచాడు. రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఇదివరకే హంగేరీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి రష్యా, బెలారస్‌లపై ఫినా నిషేధం విధించింది. అయితే జూన్, జులై నెలల్లో జరిగే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. తాజా నిషేధంతో వారు ఈ ఈవెంట్స్‌లోనూ పాల్గొనడానికి అనర్హులు. ఈ నిషేధంతో 2022లో ఎలాంటి క్రీడా ఈవెంట్స్, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం లేదు.
ఆ రెండు దేశాలపై నిషేధం తగదు: ఏటిపి
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్ ఆటగాళ్లపై నిషేధం విధించడానికి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్(ఏటిపి) తీవ్రంగా ఖండించింది. వింబుల్డన్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షం అని పేర్కొంది. ఏటీపీ ర్యాంకింగ్‌ల ఆధారంగా మాత్రమే ఆటగాళ్లను అనుమతించాలని సూచించింది. మహిళల టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూటిఏ) స్పందిస్తూ ఎటువంటి వివక్షకు చోటు లేకుండా ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను అనుమతించాలని సూచించింది. చెక్ సంతతికి చెందిన అమెరికా మార్టినా నవ్రతిలోవా స్పందిస్తూ.. ఆటగాళ్లకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వింబుల్డన్ నిర్ణయం తప్పిదమని పేర్కొన్నారు. మరో నంబర్ వన్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ స్పందిస్తూ.. క్రీడల్లో రాజకీయాలు జోక్యం చేసుకుంటే సత్ఫలితాలు రావని అదో పిచ్చి నిర్ణయమని పేర్కొన్న సంగతి తెలిసిందే.