Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్తాన్ రాయల్స్ 222/2
- పడిక్కల్ అర్ధసెంచరీ, శాంసన్ మెరుపు ఇన్నింగ్స్
వాంఖడే(ముంబయి): ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ శతకాల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన బట్లర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై శుక్రవారం మరో శతకాన్ని నమోదు చేశాడు. బట్లర్(116) సెంచరీకి తోడు ఓపెనర్ పడిక్కల్(54), సంజు(46) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీస్కోర్‌ను చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ముఖ్యంగా బట్లర్-పడిక్కల్ కలిసి తొలి వికెట్‌కు 15ఓవర్లలో 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ఎడంచేతివాటం దేవదత్ పడిక్కల్ అర్ధసెంచరీతో అలరించాడు. పడిక్కల్ 35 బంతులాడి 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. పడిక్కల్‌ను ఖలీల్ అహ్మద్ ఎల్‌బిగా ఐట్ చేసాడు. దీంతో ఢిల్లీ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో బట్లర్ సెంచరీ పూర్తి చేసుకొని మొత్తం 65 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 9భారీ సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఇప్పటికే రెండు సెంచరీలు సాధించిన బట్లర్.. ముచ్చటగా మూడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చివరికు ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బట్లర్ పెవీలియన్‌కు చేరే సమయానికే రాజస్తాన్ జట్టు 200కు పైగా పరుగులు చేసింది. మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ సంజు శాంసన్ 19 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సులు చేయడంతో రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 222పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజూర్ రెహ్మాన్‌కు తలా ఒక వికెట్ లభించాయి.
స్కోర్‌బోర్డు...
రాజస్తాన్ రాయల్స్: బట్లర్ (సి)వార్నర్ (బి)ముస్తఫిజుర్ 116, సంజు (ఎల్బి) ఖలీల్ అహ్మద్ 54, సంజు (నాటౌట్) 46, హెట్మెయిర్ (నాటౌట్) 1, అదనం 5. (20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 222పరుగులు.
వికెట్ల పతనం: 1/155, 2/202
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-47-1, శార్దూల్ 3-1-29-0, లలిత్ యాదవ్ 4-0-41-0, ముస్తఫిజుర్ 4-0-43-1, కుల్దీప్ 3-0-40-0, అక్షర్ పటేల్ 2-0-21-0
కోహ్లి రికార్డుకు చేరువలో బట్లర్
2022 సీజన్లో రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ శతకాల మోత మోగిస్తూ.. విరాట్ కోహ్లి రికార్డుకు చేరువయ్యాడు. టీమిండియా, బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 సీజన్ ఐపిఎల్‌లో నాలుగు శతకాలను బాదాడు. 2016 సీజన్లో 16మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 152.03 స్ట్రైక్‌రేట్‌తో నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలతో 973 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే రికార్డు. ఇక బ్యాటింగ్ సగటు చూస్తే 81.08. ఆ సీజన్లో విరాట్ అత్యధిక స్కోరు 113 పరుగులు. ఈసారి సీజన్-15లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ బట్లర్(491 పరుగులు) టాప్‌లో ఉన్నాడు. అదే విధంగా ఈ సీజన్లో మూడు శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ముంబయిపై 100(68 బంతుల్లో), కోల్‌కతాపై 103(61 బంతుల్లో) పరుగులు చేసిన బట్లర్ తాజాగా బెంగళూరుపై అత్యధికంగా 116(65 బంతుల్లో) పరుగులు బాదాడు. బట్లర్ సెంచరీలు బాదిన రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. బట్లర్ ఇప్పటివరకు ఆడిన 23 ఐపిఎల్ మ్యాచుల్లో నాలుగు సెంచరీలు చేస్తే.. ఈ ఒక్క సీజన్లోనే మూడు శతకాలు బాదడం విశేషం. అలాగే ఒకే సీజన్లో మూడు శతకాలు నమోదు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలోకి బట్లర్ అందరికంటే ముందువరుసలో ఉన్నాడు.