Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 39 పరుగులతో లక్నో ఘనవిజయం
- సెంచరీతో అదరగొట్టిన రాహుల్
ముంబయి : 2022 ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం జరిగిన ముంబయిపై లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 169 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి ఘోరంగా విఫలం చెందింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39), తిలక్ వర్మ (38), పోలార్డ్ (19) మాత్రమే జట్టులో రెండెంకెల స్కోరు చేశారు. లక్నో జట్టులో కునాల్ పాండ్యా 3 వికెట్లు సాధించగా, మోసిన్ ఖాన్, జాన్సన్ హోల్డర్, రవి భిష్ణోయి, అయుష్ బదోని తలా ఒకొక్క వికెట్ సాధించారు. టోర్నిలో ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడిన ముంబయి అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమి చెందింది. లక్నో జట్టు ఈ విజయంతో (8 మ్యాచుల్లో 10 పాయింట్లు) పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది..
కాగా, ఆదివారం మ్యాచ్‌లో ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. జట్టులో ఒకవైపు వరసగా వికెట్లు పడుతున్నా, మరోవైపు 62 బంతుల్లో 103 పరుగులు చేసి రాహుల్ అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. అది కూడా ముంబై ఇండియన్స్‌పై కావడం గమనార్హం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు లక్నో రాహుల్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో రాహుల్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఇక ముంబై బౌలర్లలో మెరిడిత్, పొలార్డ్ చెరో రెండు వికెట్లు సాధించగా.. సామ్స్, బుమ్రా తలా వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌కు దిగిన లక్నో మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. అయితే తరువాత ఓవర్ చివరి బంతికి 27 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన డికాక్.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో రాహుల్‌కు మనీష్ పాండే జతకలిసాడు. 22 పరుగులు చేసిన తరువాత జట్టు స్కోరు 85 పరుగుల వద్ద మనీష్ అవుటయ్యాడు. ఈ తరువాత వచ్చిన స్టోయిన్స్ డకౌట్ కాగా, కునాల్ పాండ్య (1), దీపక్ హుడా (10), అయుష్ బదోని (14) నిరాశపర్చారు. అయితే మరోవైపు రాహుల్ ముంబయి బౌలర్లుకు కొరకరాని కొయ్యిగా ఉన్నాడు. 20 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ (103), జాసన్ హోల్డర్ (0) అజేయంగా నిలిచారు.