Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
మనీల(ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ భారత బృందానికి రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత పివి సింధు, ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ సారథ్యం వహించనున్నారు. మంగళవారం నుంచి ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరగనున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సోమవారం భారత బృందం బయల్దేరి వెళ్లింది. వీరిద్దరు ఇటీవల జరిగిన టోర్నీల్లో అద్బుత ప్రదర్శన కనబరుస్తుండడంతో ఈ ఛాంపియన్‌షిప్‌లోనూ పతకాలు తప్పక సాధిస్తారనే ధీమాతో భారత షట్లర్ల బృందం ఉంది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఈ ఛాంపియన్షిప్ జరుగుతోంది. హెచ్ఎస్ ప్రణరు రారు గాయం కారణంగా వైదొలగడంతో ఆల్ ఇంగ్లండ్ రజత పతక విజేత లక్ష్యసేన్‌కు పగ్గాలు దక్కాయి. 20ఏళ్ల లక్ష్యసేన్ ఆల్మోరా టైటిల్ విజేతగా నిలిచాడు. 2020 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సేన్.. 2016, 2018లో ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ విజేత కూడా. 5వ సీడ్‌గా బరిలోకి దిగుతున్న సేన్.. తొలిరౌండ్లో 22ఏళ్ల చైనాకు చెందిన లి-షి-ఫెంగ్‌తో తలపడనున్నాడు. బి. సాయి ప్రణీత్ తొలిరౌండ్లో జొనాథన్క్రిస్టీతో, సైనా నెహ్వాల్.. కొరియాకు చెందిన సిమ్-యు జిన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు.
మహిళల డబుల్స్‌నుంచి సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప వైదొలగడంతో త్రీషా-గాయత్రి గోపీచంద్‌లకు అవకాశం దక్కింది. వీరితోపాటు అశ్విని భట్-శిఖా గౌతమ్, సిమ్రన్ సింఘి-రితికతో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో వెంకట్ గౌరవ్-జుహీ దేవాంగన్, ఇషాన్-తనీషా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.